News February 25, 2025

పాలకొండ: 12 ఏళ్లలో నలుగురు దొరికారు

image

పాలకొండ నగర పంచాయతీ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పాలకొండలో ఇప్పటివరకు 16మంది కమిషనర్‌లు పని చేశారు. అందులో నలుగురు ACBకి పట్టుబడ్డారు. 2013లో పి.నాగభూషణరావు, 2015లో టి.కనకరాజు, 2021లో నడిపేన రామారావు, ఇప్పుడు సర్వేశ్వరరావు రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

Similar News

News September 19, 2025

మేడారం జాత‌ర మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం: మంత్రులు

image

TG: తెలంగాణ కుంభ‌మేళాగా పిలుచుకొనే మేడారం జాత‌ర‌కు మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఈ మాస్ట‌ర్ ప్లాన్‌కు CM రేవంత్‌ ఆమోదం ల‌భించగానే ఆధునికీకర‌ణ ప‌నులు ప్రారంభించి.. వంద‌రోజుల్లోగా పూర్తయ్యేలా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏర్పాట్ల విషయంలో సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనలు, సలహాలు తీసుకున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.

News September 19, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 19, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.32 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు
✒ ఇష: రాత్రి 7.27 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 19, 2025

శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా రాజంపేట వాసి

image

శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా రాజంపేట పట్టణం వైబిఎన్ పల్లెకు చెందిన పోతుగుంట రమేశ్ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నంద్యాల జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.