News March 14, 2025

పాలకొల్లులో డయాలసిస్ సెంటర్ ప్రారంభం

image

రాష్ట్రంలో రెండు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే మంజూరు కాగా, అందులో ఒకటి, పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం పాలకొల్లులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనగాని సత్య కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి ప్రారంభించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. 

Similar News

News October 23, 2025

రేపు పాఠశాలలకు సెలవు: కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవును ప్రకటిస్తూ కలెక్టర్ నాగరాణి
గురువారం ఆదేశాలు జారీ చేశారు. పిడుగుపాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, చెరువుల దగ్గరగా ఉండకుండా అందరికీ సమాచారం అందించాలన్నారు. రియల్ టైమ్ సమాచారం వస్తుందని, దానిని ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News October 23, 2025

PM ఆవాస్ యోజన పథకాన్ని వినియోగించుకోవాలి: కలెక్టర్

image

PM ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం పెద అమిరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. జిల్లాలోని 319 రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 22 నుంచి సచివాలయ సిబ్బందితో సర్వే ప్రారంభించాలన్నారు. అర్హులుగా ఉండి, సొంత స్థలం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.

News October 23, 2025

ప్రజా సమస్యలను పరిష్కరించండి: కలెక్టర్

image

కాళ్ల మండలం పెదమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై గురువారం వివిధ శాఖల జిల్లా అధికారంతో కలెక్టర్ చదలవాడ నాగరాణి గూగుల్ మీట్ నిర్వహించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను నిర్ణీత గడువులోపుగా జిల్లా అధికారుల స్వీయగా పర్యవేక్షణలో పరిష్కరించాలన్నారు. లోపాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు.