News February 22, 2025

పాలకొల్లు: జగన్‌కు సవాలు విసిరిన మంత్రి నిమ్మల

image

వెలిగొండ ప్రాజెక్టుపై వాస్తవాలను ఎవరు వక్రీస్తున్నారో ప్రజా క్షత్రంలో తెల్చుకుందామని, మాజీ సీఎం జగన్‌కు మంత్రి నిమ్మల శుక్రవారం సవాల్ విసిరారు. పోడూరు మండలం జిన్నూరులో రూ.3 కోట్లతో చేపట్టిన ప్రధాన కాలువ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ..వెలిగొండ ప్రజెక్ట్‌ను మూడుసార్లు సందర్శించాను. ప్రాజెక్ట్ పూర్తికాలేదని జగన్ ఒప్పుకున్నట్లైతే జాతికి ఎలా అంకితమిచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News February 23, 2025

నరసాపురం నుంచి బైకుపై కుంభమేళాకు..

image

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు నరసాపురం వాసులు బైకుపై వెళ్లొచ్చామన్నారు. పట్టణానికి చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు చామర్తి రవి కుమార్, నాగేంద్ర బైక్‌పై రోజుకు 500కిమీ చొప్పున 3 రోజులు ప్రయాణించి ప్రయాగ్రాజ్‌కు వెళ్లారు. పవిత్ర స్నానం తర్వాత 18న బయల్దేరి 21న నరసాపురం వచ్చారు. పెట్రోల్ బంకుల్లో టెంట్లలో బస చేస్తూ వెళ్లొచ్చినట్లు తెలిపారు.

News February 23, 2025

తాడేపల్లిగూడెం: డాక్టర్ నాగేశ్వరరావు మృతి

image

తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన సీనియర్ డాక్టర్ కర్రి నాగేశ్వరరావు (84) వయోభారంతో శనివారం మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన అకాల మృతికి పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాగేశ్వరావు భౌతిక కాయాన్ని పట్టణానికి చెందిన వైద్యులు, పలువురు ప్రముఖులతో పాటు సీనియర్ న్యాయవాది మాకా శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ గట్టిం మాణిక్యాలరావు ప్రభృతులు సందర్శించి నివాళులర్పించారు.

News February 22, 2025

పెనుగొండ: చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ 

image

పెనుగొండలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఒక రోజులోనే ఛేదించారు. పెనుగొండలో గుబ్బల లక్ష్మీనారాయణ కుటుంబం షిరిడీ వెళ్లడంతో విషయం తెలుసుకొని చోరీకి పాల్పడ్డారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో చిన్నంవారిపాలెం వద్ద నివాసం ఉంటున్న కె. పోతురాజు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. అతని నివాసం వద్ద తనిఖీ నిర్వహించి 49 ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ నయీమ్ ఆచంటలో వివరించారు.

error: Content is protected !!