News April 8, 2025
పాలకొల్లు: ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై పాలకొల్లుకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానిక బ్రహ్మానందరెడ్డి కాలనీకు చెందిన రత్నకుమార్ తనకంటే వయసులో పెద్దయిన అమ్మాయిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంట తిరిగేవాడు. ఆమె ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపానికి గురైన రత్నకుమార్ ఇంటిపై అంతస్తులో పడుకుంటానని వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 22, 2025
ఈనెల 27న TPG లో కొనుగోలు కేంద్రం ప్రారంభం: జేసీ

ఈనెల 27న తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు జేసీ రాహుల్ తెలిపారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతు సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు.
News October 21, 2025
భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జై సూర్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. డీఎస్పీ పరిధిలో పేకాట స్థావరాలు పెరగడం, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారశైలిపై జిల్లా ఎస్పీ అదాన్ నయీమ్ అస్మితో మంగళవారం మాట్లాడిన పవన్, వెంటనే డీఎస్పీపై విచారణకు ఆదేశించి, నివేదికను హోం శాఖకు, డీజీపీకి పంపించాలని ఆదేశించారు.
News October 21, 2025
పేరుపాలెం బీచ్ సందర్శకులకు అనుమతి లేదు: ఎస్ఐ

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున బుధవారం పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించడం లేదని మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.