News April 5, 2025
పాలకోడేరు: అనుమానాస్ప స్థితిలో కానిస్టేబుల్ మృతి

పాలకోడేరు(M) శృంగవృక్షం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు(37) అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదైంది. ఆకివీడు పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఇటీవల అనారోగ్యం కారణంగా స్వగ్రామానికి వచ్చారు. గురువారం అర్ధరాత్రి బాత్‌రూమ్‌కి వెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో భార్య వెళ్లి చూడగా స్పృహతప్పి ఉన్నారు. వైద్యునికి చూపించగా చనిపోయినట్లు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News April 6, 2025
7న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

భీమవరంలోని కలెక్టరేట్‌లో ఈ నెల 7న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని.. గమనించాలని కోరారు. డివిజన్, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు విధిగా హాజరుకావాలన్నారు. కాగా పలు కారణాలతో గత వారం పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దైన సంగతి తెలిసిందే.
News April 6, 2025
ఆకివీడులో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఆకివీడు జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ మృతి చెందాడు. ఆకివీడు పెదపేటకు చెందిన మేకల మైకేల్ రాజ్ (40) రహదారి దాటుతుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆకివీడు ఎస్ఐ హనుమంతు నాగరాజు తెలిపారు. కాగా మైకేల్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
News April 6, 2025
ప.గో: తాగునీరు సమస్య లేకుండా ప్రణాళిక: జేసీ

వేసవి దృష్ట్యా జిల్లాలో ప్రజలకు తాగునీరు అందించడంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జేసీ రాహుల్ అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు, మజ్జిగ అందించాలన్నారు.