News December 14, 2024

పాలకోడేరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి-ఎస్సై

image

సోంపల్లి శివాలయం సమీపంలో గురువారం రాత్రి రెండు మోటర్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో గాయపడిన పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరుకు చెందిన కొరత్తిక బాబి కాకినాడ జీ.జీ.హెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాబి సొంత పనుల నిమిత్తం పల్సర్ బైక్‌పై మండపేట వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మృతుని తల్లి దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రాజోలు ఎస్ఐ రాజేష్ తెలిపారు.

Similar News

News November 18, 2025

తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిపై దృష్టి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ థింక్స్ ఆక్వా పాండ్స్” కార్యక్రమానికి మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించే దిశగా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

News November 18, 2025

అన్నదాత సుఖీభవ, ధాన్యం సేకరణపై జేసీ సమీక్ష

image

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల రెండో విడత నగదు జమ, ఖరీఫ్ ధాన్యం సేకరణపై జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం భీమవరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించి, వారి సూచనల మేరకు నిర్వహించాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు కలిపి రూ.7 వేలు జమ అవుతాయని తెలిపారు.

News November 18, 2025

జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్

image

జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, దీనిపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.