News March 20, 2024

‘పాలమూరుకు మోదీ వచ్చినా కాంగ్రెస్‌దే గెలుపు’

image

నరేంద్ర మోదీ వచ్చిన పాలమూరులో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని పార్లమెంటరీ అభ్యర్థి చెల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. నేడు మహబూబ్నగర్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. డీకే అరుణ తరఫున ప్రచారానికి నరేంద్ర మోడీ వచ్చినా గెలుపు మాత్రం కాంగ్రెస్ దే అని ధీమా వ్యక్తం చేశారు. డీకే అరుణ ఎన్ని ఎత్తుగడలు వేసినా ఆమె ఓటమి తప్పదని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News

News September 13, 2024

‘ప్రజా పాలన దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి’

image

జిల్లా కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్ లో అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఎస్పీ పరేడ్ మైదానంలో సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు.

News September 13, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!

image

✒వర్షాల EFFECT.. దెబ్బతిన్న పత్తి పంట
✒NGKL:ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
✒నేషనల్ కిక్ బాక్సింగ్‌లో కోటకొండ బిడ్డకు గోల్డ్ మెడల్
✒ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్
✒ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి:కలెక్టర్లు
✒GDWL: డ్రంక్&డ్రైవ్‌లో ఆరుగురిపై కేసు నమోదు
✒చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షలు తప్పవు: న్యాయమూర్తి శ్రీలత
✒భారీ వర్షం..ఎకరానికి రూ.30 వేలు నష్టపరిహారం ఇవ్వాలి:CPI

News September 12, 2024

నేషనల్ కిక్ బాక్సింగ్‌లో కోటకొండ బిడ్డకు గోల్డ్ మెడల్

image

నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన గొల్ల అజయ్ క్రీడల్లో సత్తా చాటాడు. జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారు. అజయ్ నిరుపేద కుటుంబానికి చెందిన బిడ్డ కాగా.. తండ్రి దస్తప్ప వ్యవసాయంతో పాటు గొర్రెల కాపరిగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న అజయ్.. చదువుతోపాటు ఇష్టమైన కిక్ బాక్సింగ్‌లో మెడల్ సాధించి ఔరా అనిపించాడు.
-CONGRATS