News July 26, 2024
పాలమూరుకు వాతావరణ శాఖ అలర్ట్..
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మరో 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేటలో వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. కాగా నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇందులో భాగంగా 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
Similar News
News November 29, 2024
రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా: హరీశ్ రావు
సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివాస్లో సీఎం రేవంత్ పై హరీశ్ రావు మండిపడ్డారు. ‘రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా, ఇచ్చిన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. అప్పుడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తే రేవంత్ పారిపోయిండు. రేవంత్ మీద ఉద్యమ కేసులు లేవు కానీ.. ఓటుకు నోటు కేసు మాత్రం నమోదైంది’ అని హరీశ్ రావు అన్నారు.
News November 29, 2024
నాగర్ కర్నూల్: మధ్యాహ్న భోజనం తిని నలుగురు విద్యార్థుల అస్వస్థత
మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని గోరిట ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని శుక్రవారం నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. టమాటా రైస్, గుడ్డు తిన్న నలుగురు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు వైద్యులను పాఠశాలకు పిలిపించి అక్కడే చికిత్స అందించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 29, 2024
బాలానగర్ సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయండి: SKLTSHU
బాలానగర్ మండల సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మండలంలో పుట్టిన సీతాఫలం ఇతర జిల్లాల్లో విస్తరించింది. ఈ చెట్టుకు అందమైన ఆకులు, గుండ్రని ఆకారంలో రుచికరమైన పండ్లు ఉంటాయి. ఈ సీతాఫలాలు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు వస్తే ఈ రకానికి చట్టబద్ధత రక్షణ కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.