News July 26, 2024

పాలమూరుకు వాతావరణ శాఖ అలర్ట్..

image

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మరో 3 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేటలో వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. కాగా నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇందులో భాగంగా 40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

Similar News

News December 1, 2024

MBNR: లారీ ఢీకొని యువరైతు దుర్మరణం

image

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని వాడ్యాల గేటు సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువరైతు దుర్మరణం చెందాడు. మండలంలోని దోనూరు గ్రామానికి చెందిన కుమార్ (24) స్పింక్లర్ పైపులు తీసుకొని వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 1, 2024

ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలి: MP మల్లు రవి

image

రిజర్వేషన్లపై నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు ఉండాలని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన మాలల సింహగర్జన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. మాల, మాదిగలు ఐక్యంగా ఉండి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధనకై ఉద్యమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, మాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

News December 1, 2024

షాద్‌నగర్: ట్రాక్టర్ బోల్తా.. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి

image

కొత్తూరు మున్సిపాలిటీ స్టేషన్ తిమ్మాపూర్ వద్ద <<14756133>>ట్రాక్టర్ బోల్తా<<>> పడి ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే. కాగా మృతుల్లో మహిళతోపాటు ఐదేళ్ల చిన్నారి ఉండటం కలిచివేసింది. APలోని కర్నూల్‌కు చెందిన కూలీలు మండలంలోని రెడ్డిపాలెంలో పనులకు వస్తున్నారు. తిమ్మాపూర్‌లో రైలు దిగిన వారు ట్రాక్టరుపై రెడ్డిపాలెం వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో సోమమ్మ(50), మమత(5) అక్కడిక్కకడే మృతిచెందారు.