News April 12, 2024

పాలమూరులో అడుగంటుతున్న భూగర్భ జలాలు

image

పాలమూరు జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. నాలుగేళ్ల క్రితం భూగర్భ జలాలు 10 మీటర్ల కన్నా ఎక్కువ లోతుకు వెళ్లగా ప్రస్తుతం జిల్లాలో 11.43 మీటర్ల లోతుకు నీరు వెళ్లిపోయింది. 2020 తరువాత ఈ స్థాయిలో లోతుకు నీరు వెళ్లడం ఇదే తొలిసారి. గతేడాది మార్చిలో 7.97 మీ. లోతులో నీరుండగా ప్రస్తుతం గతేడాదికి అదనంగా మరో 3.46 మీ. లోతుకు నీరు వెళ్లిపోవడంతో బోర్లలో నీటిమట్టం తగ్గిపోతోంది.

Similar News

News October 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యవార్తలు!!

image

✔DSC-2024 ఉద్యోగాలు సాధించిన పలువురికి ఘన సన్మానం
✔IMEX అమెరికా 2024 ట్రేడ్ షోలో పాల్గొన్న మంత్రి జూప‌ల్లి
✔GDWL:పాము కాటుతో డిగ్రీ విద్యార్థి మృతి
✔NRPT: చెట్టుకు ఢీకొని కారు దగ్ధం
✔MBNR: హజ్ యాత్రకు 170 మంది ఎంపిక
✔సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: కలెక్టర్లు
✔ఘనంగా బతుకమ్మ సంబరాలు
✔మక్తల్:రోడ్డు ప్రమాదం..మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే శ్రీహరి

News October 10, 2024

మహబూబ్‌నగర్‌లో అతిపెద్ద అంతర్జాతీయ విద్యా సదస్సు

image

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలకునే విద్యార్థుల కోసం మన మహబూబ్‌నగర్‌లో వన్ విండో, జయప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాల వారు సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక సుదర్శన్ కన్వెన్షన్ హాల్‌లో ఈనెల 11న నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ విద్యా సదస్సులో పాల్గొన దలచిన వారు <>https://bit.ly/MBNRFAIR24<<>> లింకు ద్వారా ఉచితంగా తమ పేరు నమోదు చేసుకుని విదేశీ విద్యా సంస్థల ప్రతినిధులతో నేరుగా మాట్లాడవచ్చు.

News October 10, 2024

కొడంగల్: నాన్నకు ప్రేమతో..!

image

కొడంగల్ మండలం హుస్నాబాద్‌కు చెందిన శ్రీశైలం గౌడ్ డీఎస్సీ సాధించేందుకు నిరంతరం శ్రమించి రైతుగా మిగిలిపోయాడు. తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్య డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డారు. సుధ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్‌లో మొదటి ర్యాంకు సాధించగా.. శ్రీకావ్య ఎస్‌జీటీగా ఎంపికైంది. దీంతో గ్రామస్థులు అభినందించారు.