News April 8, 2025

పాలమూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

image

పాలమూరు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 58మంజూరు పోస్టులకు గాను 16 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 42ఖాళీలు ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

Similar News

News December 1, 2025

శ్రీకాకుళం: ‘దిత్వా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

దిత్వా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి భారీ ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని కోరారు.

News December 1, 2025

GNT: విడదల రజిని చూపు ఎటువైపు..?

image

మాజీ మంత్రి విడదల రజిని వైసీపీతో బంధం సడలిస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడి పెంచుతోంది. గుంటూరు పశ్చిమ ఓటమి అనంతరం చిలకలూరిపేటలో చురుగ్గా ఉన్న ఆమెను రేపల్లెకు వెళ్లమన్న పార్టీ అధినేత ఆదేశం అసంతృప్తికి కారణమైనట్లు టాక్. దీంతో ఆమె త్వరలో పార్టీ మారే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది.

News December 1, 2025

సిద్దిపేట: ఇద్దరు ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ

image

సిద్దిపేట జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన రిపోర్టు పంపించనందున ఇద్దరు ఎంపీఓలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జగదేవపూర్ ఎంపీఓ ఖాజా మోహినోద్దీన్, ములుగు ఎంపీఓ కలీంలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు రిపోర్టు సరైనదిగా పంపనందున షోకాజ్ జారీ చేసినట్లు తెలిపారు.