News April 8, 2025
పాలమూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

పాలమూరు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 58మంజూరు పోస్టులకు గాను 16 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 42ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Similar News
News October 21, 2025
టీచర్లకు షాక్… TET మినహాయింపునకు NCTE తిరస్కరణ

దేశవ్యాప్తంగా ఇప్పటికే సర్వీసులో ఉన్న ప్రభుత్వ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వినతిని NCTE తిరస్కరించింది. 5 ఏళ్లకు మించి సర్వీసు ఉన్నవారంతా 2 ఏళ్లలో <<17587484>>టెట్<<>> పాసవ్వాల్సిందేనని ఇటీవల SC తీర్పిచ్చింది. 2017 పార్లమెంటు తీర్మానం ప్రకారం ఈ తీర్పిచ్చినందున అంతకు ముందు నియమితులైన వారికి వర్తింపచేయరాదని వారు కోరారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో NCTE తిరస్కరించింది.
News October 21, 2025
191 మంది పోలీస్ అమరవీరులకు సీపీ నివాళులు

విధినిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమని రామగుండం CP అంబర్ కిషోర్ ఝా అన్నారు. RGM CP కార్యాలయంలో అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని(ఫ్లాగ్ డే)ను ఘనంగా నిర్వహించారు. గతేడాది నుంచి ఇప్పటివరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 191 మంది పోలీస్ అమరవీరులకు CP నివాళులర్పించారు. అమరుల త్యాగాలు శాఖకు మార్గదర్శకమని, వారి కుటుంబాలకు మద్దతందిస్తామని CP అన్నారు.
News October 21, 2025
కందుకూరులో పోలీసులు అతి: YCP

కందుకూరులో పోలీసులు చాలా అతి చేస్తున్నారని YCP మండిపడింది. ‘TDPగూండాల చేతిలో దారుణ హత్యకి గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న YCP నేత అంబటి మురళిని పోలీసులు అడ్డుకున్నారు. నిందితులు టీడీపీ నేతలే కావడంతో ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయట్లేదు. అఖరికి పరామర్శకు సైతం దూరం చేస్తూ కాపులపై కక్ష సాధిస్తున్నావా చంద్రబాబు’ అని వైసీపీ ప్రశ్నించింది.