News April 8, 2025
పాలమూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

పాలమూరు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 58మంజూరు పోస్టులకు గాను 16 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 42ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Similar News
News April 23, 2025
గద్వాల: ఇంటర్ FAIL అవుతానేమోనని చనిపోయాడు.. కానీ పాసయ్యాడు!

ఓ ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లా మల్దకల్(M) మల్లెందొడ్డికి చెందిన వినోద్(18) గద్వాల GOVT జూనియర్ కాలేజీలో ఇంటర్ 1st YEAR చదువుతున్నాడు. తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భయంతో ఇటీవల పురుగు మందు తాగగా చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. అయితే మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వినోద్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు.దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News April 23, 2025
రైతు బిడ్డకు 465 మార్కులు

గుత్తి మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ, రజిని దంపతుల కుమారుడు రేశ్వంత్ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటాడు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదివిన యువకుడు ఎంపీసీలో 470కు గానూ 465 మార్కులు సాధించాడు. యువకుడిని రైతులు, ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.
News April 23, 2025
NLG. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కవలలు

ఇంటర్ ఫలితాలలో నల్గొండకు చెందిన విద్యార్థినులు( కవలలు) దుర్గాంజలి, అఖిల సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 466/470, 461/470 మార్కులు సాధించారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అత్యధిక మార్కులు సాధించినందుకు ఆనందంగా ఉందని విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు సహకరించిన తల్లిదండ్రుల, గురువులకు కృతజ్ఞతలు తెలిపారు.