News April 8, 2025
పాలమూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

పాలమూరు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 58మంజూరు పోస్టులకు గాను 16 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 42ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Similar News
News November 28, 2025
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.7.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. ఏపీ, తెలంగాణలో రూ.4.35 కోట్లు వసూలు చేసింది. అటు ఓవర్సీస్లోనూ ఫస్ట్ డే 2,75,000 డాలర్స్ కలెక్ట్ చేసింది. రేపటి నుంచి వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి.
News November 28, 2025
రబీకి సాగునీటి సమస్యలు రాకుండా చూడాలి: కలెక్టర్

రబీ సీజన్లో వరి సాగుకు ఎటువంటి సాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఇటీవల జరిగిన ఇరిగేషన్ సలహా మండలి సమావేశం అంశాలపై శుక్రవారం ఆయన సమీక్షించారు. చిట్ట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
News November 28, 2025
U-19 ఆసియా కప్ ఇండియా టీమ్ ఇదే

ACC మెన్స్ U-19 ఆసియా కప్కు BCCI స్క్వాడ్ను ప్రకటించింది. ఆయుష్ మాత్రేకి కెప్టెన్సీ ఇవ్వగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. దుబాయ్ వేదికగా DEC 12నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. DEC 14న IND-PAK తలపడనున్నాయి.
IND U-19 స్క్వాడ్: ఆయుష్ మాత్రే(C), సూర్యవంశీ, విహాన్(vc), వేదాంత్, అభిజ్ఞాన్, హర్వాన్ష్, యువరాజ్ గోహిల్, కనిష్క్, ఖిలాన్, పుష్పక్, దీపేశ్, హెనిల్ పటేల్, కిషన్, ఉధవ్, ఆరోన్ జార్జ్


