News December 15, 2024
పాలమూరులో 49 వేల ఇందిరమ్మ ఇళ్లు !
ఇందిరమ్మ ఇళ్ల స్కీంతో ఉమ్మడి జిల్లాలోని నిరుపేదల సొంతింటి కల తీరనుంది. మొదటి విడతలో దాదాపు 49వేల మందికి లబ్ధి చేకూరనుంది. స్థలం ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో 36.14 లక్షల జనాభా ఉండగా.. 2,43,796 కుటుంబాలు అద్దె ఇళ్లల్లో ఉంటున్నాయి. ఇందులో అత్యధికంగా NGKL జిల్లాలో 70,025 కుటుంబాలు ఉన్నాయి. అధికారుల ఇంటింటి సర్వేతో జిల్లాలోని లబ్ధదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
Similar News
News January 21, 2025
MBNR : ప్రభుత్వ ఆసుపత్రిలో ఉరేసుకొని మహిళ మృతి
మహబూబ్ నగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మంగళవారం ఉదయం ఉరేసుకొని ఓ మహిళ మృతి చెందింది. బంధువుల వివరాల ప్రకారం.. దామరగిద్ద మండలం కందేన్‌పల్లికి చెందిన నారమ్మ (32) తీవ్ర అనారోగ్యంతో సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో చేరింది. మంగళవారం ఉదయం కాలకృత్యాలకు వెళ్లి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 21, 2025
ఐజ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బింగి దొడ్డికి చెందిన వీరాంజనేయులు తన పుట్టినరోజు వేడుకల కోసం స్నేహితులతో కలిసి బైక్‌పై ఐజాకి వెళ్లి వస్తున్నాడు. తిమ్మప్ప ఆలయం దగ్గర అతడి బైక్‌ను మరొక బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరాంజనేయులుకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
News January 21, 2025
కొడంగల్: సీఎంని, పోలీసులని దూషించిన వ్యక్తికి 14 రోజుల రిమాండ్: ఎస్ఐ
ఈనెల 9న సాయంత్రం కోస్గి పరిధి సర్జఖాన్‌పేట్‌కి చెందిన కోస్గి కృష్ణయ్య గౌడ్ CM రేవంత్ రెడ్డిని, పోలీసులను అసభ్య పదజాలంతో దూషించాడని స్థానిక ఎస్ఐ తెలిపారు. ప్రజాశాంతికి భంగం కలిగించేలా, రెండు వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడి దానిని వీడియో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశాడని, ఈ మేరకు అతడిపై ఈనెల 11న కేసు నమోదు చేసి 20న అరెస్ట్ చేశామన్నారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.