News February 26, 2026
పాలమూరు:₹.150కే తలంబ్రాలు.. ఫోన్ చేయండి

భద్రాచలంలోని సీతారాముల కళ్యాణ తలంబ్రాలు రూ.151/- చెల్లించి బుక్ చేసుకోవాలని మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్, లాజిస్టిక్స్ ఏటిఎం బద్రి నారాయణ తెలిపారు. పూర్తి వివరాలకు
✒గద్వాల, నాగర్‌కర్నూల్ & వనపర్తి డిపో-91542 98609
✒కొల్లాపూర్, కల్వకుర్తి & అచ్చంపేట డిపో-91542 98611
✒మహబూబ్ నగర్, షాద్ నగర్ నారాయణపేట & కోస్గి డిపో- 91542 98612
Similar News
News April 13, 2026
WGL: బర్త్‌డేలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..!

నర్సంపేటలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఉప్పరపల్లికి చెందిన చింతకింది శివకృష్ణ, మౌనిక దంపతులకు ముగ్గురు సంతానం. కూతురు అక్షర 2020 జూన్ 3వ తేదీన జన్మించింది. రెండవ సంతానం అర్జున్ 2022, జూన్ 3వ తేదీన, మూడవ సంతానం ఆదిత్య 2024 జూన్ 3వ తేదీన జన్మించాడు. ముగ్గురూ ఒకే నెల, ఒకే తేదీన రెండేళ్ల వ్యవధిలో జన్మించడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.
News April 13, 2026
సిద్దిపేట: గొర్రెల కాపరి కూతురి సత్తా..!

బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన గొడ్డటి కోమల ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. వర్గల్‌లో సోషల్ వెల్పేర్ పాఠశాలలో చదువుతున్న ఆమె ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించింది. గొర్రెల కాపరి అయిన లచ్చయ్య కుమార్తె కోమల, పేదరికాన్ని జయించి అత్యుత్తమ మార్కులు సాధించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోమల విజయం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
News April 13, 2026
రాప్తాడు సమీపంలో ప్రమాదం.. 6ఏళ్ల బాలుడి మృతి

రాప్తాడు మండలం మరూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు గగన్ మృతి చెందాడు. పెద్దపప్పూరు మండలం సోమనపల్లికి చెందిన మమత తన కుమారుడు, తమ్ముడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో గగన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తల్లితో పాటు తమ్ముడు మారుతీకి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


