News April 2, 2025
పాలమూరు: ఆన్లైన్ బెట్టింగ్లు.. యువతా జర జాగ్రత్త..!

ఐపీఎల్ మ్యాచ్లు జోరుగా కొనసాగుతున్నాయి. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో క్రికెట్ బెట్టింగ్లతో రూ.లక్షలు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. 2 రోజుల క్రితం గద్వాలకు చెందిన ఓ యువకుడు బెట్టింగులతో రూ.5 లక్షలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్లు పెట్టి యువకులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News November 27, 2025
HYD: మీ చేతిరాత బాగుంటుందా?

మీ చేతిరాత అందంగా ఉంటుందా? నలుగురూ మీ రాతను మెచ్చుకుంటారా? అయితే ఇంకెందుకాలస్యం.. చేతిరాత పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రైటింగ్ స్కిల్స్పై అవగాహన, ఆసక్తి కల్పించేందుకు చేతిరాత పోటీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు స్టీఫెన్ తెలిపారు. పాఠశాలస్థాయి, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఈ పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు www.indianolympiads.comలో నమోదు చేసుకోవాలి.
News November 27, 2025
రాజమండ్రి: 29న మెగా జాబ్ మేళా

రాజమండ్రి కలెక్టరేట్ పరిసరాల్లోని ‘వికాస’ కార్యాలయం సమీపంలో నవంబర్ 29వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన, 35 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల యువత తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7660823903 నంబరును సంప్రదించాలని కోరారు.
News November 27, 2025
వారికి నిద్ర అవసరం: సుందర్ పిచాయ్

‘జెమిని 3’ మోడల్ కోసం తన బృందం కొన్ని వారాల పాటు విరామం లేకుండా పని చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఉద్యోగులంతా ఎంతో అలసిపోయారు. కొందరికి నిద్ర అవసరం. ఇప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ‘గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్’ పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడారు. జెమిని 3 ఏఐ మోడల్ను ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.


