News March 31, 2025
పాలమూరు: ఒకే వేదికపై మూడు పార్టీల నేతలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకే వేదికపై మూడు పార్టీల నేతలు కలిశారు. సోమవారం నారాయణపేట జిల్లాలో రంజాన్ పండుగా సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, బీజేపీ నేత నాగురావు నామాజీలు రంజాన్ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 26, 2026
ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవే!

శరీర కండరాల బలం, రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ మెరుగవ్వడానికి ప్రొటీన్ ఫుడ్ చాలా అవసరం. చికెన్ బ్రెస్ట్, చేపలు, గుడ్లు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, సోయా, బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, గుమ్మడికాయ గింజల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని డైలీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆకలిని తగ్గించి బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.
News February 26, 2026
సంగారెడ్డి: పెన్షన్ పెంపు కోసం పోరాటం తప్పదు: NPRD

సంగారెడ్డి గణేష్ నగర్‌లో ఎన్‌పీఆర్‌డీ(NPRD) 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బసవరాజ్ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ.. వికలాంగుల పెన్షన్ పెంపు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వికలాంగుల హక్కుల సాధనకై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
News February 26, 2026
KNR: పీజీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన SU రిజిస్ట్రార్

శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కరీంనగర్‌లోని వివేకానంద డిగ్రీ & పిజి కళాశాల పరీక్షా కేంద్రాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య యు.సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు నడుస్తున్న తీరును పరిశీలించారు.


