News February 26, 2026

పాలమూరు: కల్తీ పాల తయారీ కలకలం

image

కల్వకుర్తి నియోజకవర్గంలోని రావిచేడు గ్రామంలో కల్తీ పాల తయారీ కలకలం రేపింది. గ్రామానికి చెందిన శ్రీశైలం అనే వ్యక్తి రైతుల వద్ద నుంచి పాలు సేకరించి వాటికి తోడు మరిన్ని కల్తీ పాలు తయారు చేసి ప్రైవేట్ పాల డైరీకి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటూ వచ్చాడు. ఈ విషయం పసిగట్టిన ఎస్ఓటీ అధికారులు బుధవారం సాయంత్రం కల్తీ పాల తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించి వారికి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News April 20, 2026

జగిత్యాల: ఏడాది తర్వాత KCR స్పీచ్.. సర్వత్రా ఉత్కంఠ!

image

వరంగల్‌లో పార్టీ రజతోత్సవ సభ జరిగిన ఏడాది తర్వాత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు జగిత్యాలలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ప్రజాక్షేత్రంలోకి రానుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ సభలో కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ సంధించే విమర్శనాస్త్రాలు ఎటువంటి మలుపు తీసుకుంటాయోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

News April 20, 2026

సిద్దిపేట: జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

image

జగిత్యాలలో కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో జరిగే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇప్పటికే బహిరంగ సభ ఏర్పాట్లను కేటీఆర్, హరీశ్ రావులు పరిశీలించారు. నేడు జరగనున్న ఈ సభకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు, కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయనున్నారు.

News April 20, 2026

హార్ముజ్‌లో భద్రత ఫ్రీగా రాదు: ఇరాన్

image

USతో మళ్లీ ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ ఇంధన భద్రత ఉచితంగా రాదని, కొంత మూల్యం చెల్లించాల్సిందేనని పేర్కొంది. ఓవైపు ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ మరోవైపు ఇతరులకు మాత్రం హార్ముజ్‌లో ఫ్రీగా భద్రత కావాలనుకోవడం కుదరదని ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ స్పష్టం చేశారు. ఇరాన్ దాని మిత్రపక్షాలపై ఉన్న ఒత్తిడికి ముగింపు పలికితేనే చమురు ధరలు స్థిరంగా ఉంటాయన్నారు.