News April 1, 2025

పాలమూరు: కాంగ్రెస్ పార్టీపై RSP ఫైర్

image

ఎస్సీ సబ్ ప్లాన్ కింద రావాల్సిన రూ.35,000 కోట్ల నిధులను ఏ పందికొక్కులు బుక్కినవి అంటూ ఉమ్మడి పాలమూరు వాసి, BRS రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివే పేద దళిత, గిరిజన పిల్లలకు ఉచితంగా ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు ఇంతవరకు ఇవ్వకపోవడం దేనికి సంకేతం? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అనాథగా మారిందంటూ Xలో ట్వీట్ చేశారు. 

Similar News

News December 4, 2025

కాకినాడ: రాష్ట్రానికి పర్యాటకుల వెల్లువ

image

‘దేఖో అప్నా దేశ్’ స్ఫూర్తితో రాష్ట్రంలో పర్యాటక రంగం కళకళలాడుతోంది. 2024లో రికార్డు స్థాయిలో 29.2 కోట్ల మంది పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఎంపీ సానా సతీశ్ గురువారం పార్లమెంటులో ఆయన అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. పర్యాటక వృద్ధికి కేంద్రం తీసుకున్న చర్యలు దోహదపడ్డాయని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని మంత్రి తెలిపారు.

News December 4, 2025

కొయ్యలగూడెం RWS కార్యాలయంపై ACB దాడులు

image

కొయ్యలగూడెం ఆర్డబ్ల్యూఎస్ (RWS-రూరల్ వాటర్ సప్లై) కార్యాలయంలో ACB అధికారులు గురువారం సాయంత్రం ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఓ కాంట్రాక్టర్ నుండి భారీ మొత్తంలో నగదు లంచం తీసుకుంటుండగా RWS శాఖకు చెందిన ఇరువురు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 4, 2025

రాజన్న సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి గరిమ అగ్రవాల్, జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు రవి కుమార్‌తో కలిసి గురువారం హాజరయ్యారు.