News April 1, 2025
పాలమూరు: కాంగ్రెస్ పార్టీపై RSP ఫైర్

ఎస్సీ సబ్ ప్లాన్ కింద రావాల్సిన రూ.35,000 కోట్ల నిధులను ఏ పందికొక్కులు బుక్కినవి అంటూ ఉమ్మడి పాలమూరు వాసి, BRS రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివే పేద దళిత, గిరిజన పిల్లలకు ఉచితంగా ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు ఇంతవరకు ఇవ్వకపోవడం దేనికి సంకేతం? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అనాథగా మారిందంటూ Xలో ట్వీట్ చేశారు.
Similar News
News March 5, 2026
విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.
News March 5, 2026
సెమీస్.. భారత్ భారీ స్కోర్

T20WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. అభిషేక్(9), సూర్య(11) విఫలమవగా, సంజూ శాంసన్ 89, ఇషాన్ 39, శివమ్ దూబే 43, తిలక్ 21, హార్దిక్ 27 రన్స్‌తో రాణించారు. విల్ జాక్స్, రషీద్ చెరో 2, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఇంగ్లండ్ 254 పరుగులు చేయాలి. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడుతుంది.
News March 5, 2026
పార్వతీపురం: ఆర్ అండ్ బీ పనుల్లో వేగం పెంచాలి

జిల్లాలో కొనసాగుతున్న రహదారులు, భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 1,030 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారుల నెట్‌వర్క్ ఉందని, ఇందులో 464 కి.మీ. స్టేట్ హైవేలు, 566 కి.మీ. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు ఉన్నాయని తెలిపారు. మెజారిటీ పనులు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని పూర్తి చేయాలన్నారు.


