News May 4, 2024

పాలమూరు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే: సీఎం రేవంత్

image

మహబూబ్‌నగర్ పార్లమెంట్ గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ‘మహబూబ్‌నగర్‌లో లక్ష మెజారిటీతో వంశీచంద్ రెడ్డి గెలవడం ఖాయం. వారసత్వంగా నేను రాజకీయాలు చేయడం లేదు. గతంలో వనపర్తిలో కాంగ్రెస్ గెలుపు కోసం గల్లీగల్లీ తిరిగా. పాలమూరులో 14 సీట్లకు 12 ఇచ్చి ఆశీర్వదించి నందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

Similar News

News December 11, 2025

మహబూబ్‌నగర్: పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సేవలు

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి దేశ పోలింగ్ సందర్భంగా 139 గ్రామపంచాయతీలలో పోలికొనసాగుతోంది. ఆయా గ్రామపంచాయతీలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారు ఎవరైనా అనారోగ్యానికి గురైనట్లయితే వెంటనే వారికి అక్కడే వైద్యం అందు విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే వారికి అక్కడికక్కడే అందించేందుకు అన్ని రకాల టాబ్లెట్లను సిద్ధంగా ఉంచారు.

News December 11, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో 22.55% ఓటింగ్

image

మహబూబ్‌నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి 22.55% పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలింగ్ మందకోడిగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉదయం 8 గంటల తర్వాత ఓటర్లు రాక మొదలైంది. పోలింగ్ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులను జాగ్రత్తగా కేంద్రంలోకి తీసుకెళ్లి ఓటు వేయిస్తున్నారు.

News December 11, 2025

సల్కర్‌పేటలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో గత 24 గంటల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. గండీడ్ మండలం సల్కర్ పేట 8.3 డిగ్రీలు, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 9.4, బాలానగర్ 9.5, రాజాపూర్ 9.8, భూత్పూర్ 9.9, మహమ్మదాబాద్ 10.4, కౌకుంట్ల 10.7, కోయిలకొండ మండలం పారుపల్లి, మూసాపేట మండలం జానంపేట10.8, దేవరకద్ర, మిడ్జిల్ మండలం దోనూరు 10.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది.