News February 26, 2026
పాలమూరు జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు బదిలీ

ఉమ్మడిజిల్లాలో ముగ్గురు కలెక్టర్లను బదిలీచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసింది.మహబూబ్ కలెక్టర్‌గా ఉన్న విజయేంద్రబోయి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా బదిలీఅయ్యారు. నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా, గద్వాల జిల్లా కలెక్టర్ బీఏం సంతోష్‌ను గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Similar News
News April 16, 2026
ఏపీలో 38, తెలంగాణలో 26 సీట్లకు పెంపు: షా

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా LSలో విమర్శించారు. ‘అందులో ఏ మాత్రం నిజం లేదు. దక్షిణాదిలో జనాభా రేషియో కంటే ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయి. ఏపీలో సీట్లు 25 నుంచి 38, తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయి. కర్ణాటక, తమిళనాడులోనూ అంతే. ఇది నా గ్యారంటీ. విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని స్పష్టం చేశారు.
News April 16, 2026
రూ. 74.2 కోట్లతో కాలువలు, రోడ్ల అభివృద్ధి: కలెక్టర్

ఆత్రేయపురం మండలం లొల్లలాకులు కాలువల మరమ్మతులు, ఆధునీకరణ, రావులపాలెం-బొబ్బర్లంక రహదారి విస్తరణ పనుల కోసం ప్రభుత్వం ₹74.2 కోట్లు కేటాయించింది. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే పరిపాలన అనుమతులు లభించాయి. ప్రస్తుతం డిజైన్ ప్రతిపాదనలు చీఫ్ ఇంజినీర్ పరిశీలనలో ఉన్నాయని, అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు.
News April 16, 2026
TG DEECET దరఖాస్తుల సవరణకు అవకాశం

TG DEECET-2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగిన దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మొత్తం 32,611 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఈనెల 17, 18వ తేదీల్లో వెబ్‌సైట్ ద్వారా సవరించుకోవచ్చు. సందేహాల నివృత్తికి 8317567404 నంబర్‌ను సంప్రదించాలని కన్వీనర్ సూచించారు.


