News November 9, 2024

పాలమూరు జిల్లాలో ACBకి పట్టుబడ్డ అధికారులు వీళ్లే!1/2

image

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది <<14566088>>ACBకి <<>>14 మందిపై కేసులు నమోదు కాగా.. 21 మందిని కోర్టులో హాజరుపరిచారు. JAN 20న రమావత్ వశ్య (డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే), 22న బాలోజీ (ఎక్సైజ్ CI),29న జీవరత్నం (లైన్‌మెన్), FEB 4న సురేష్(SI), 10న ఎస్.పృథ్వీ (ఏఈ), MAR 27న పాండునాయక్ (MRO), రవీందర్ రెడ్డి (ధరణి ఆపరేటర్),మొగులప్ప(రికార్డు అసిస్టెంట్), MAY 31న నరేందర్ కుమార్(డీఈ), వెంకటనాగేంద్ర కుమార్ (ఎస్ఈ), బి.మధుకర్(ఏఏఈ)

Similar News

News December 8, 2024

 వనపర్తి: వాలీబాల్‌ ఆడుతూ టెన్త్‌ విద్యార్థి మృతి

image

వనపర్తి జిల్లాలో జరిగిన సీఎం కప్‌ పోటీల్లో పాల్గొన్న ఓ విద్యార్థి కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. పెద్దమందడి మం. ముందరితండాకు చెందిన సాయి పునీత్‌(15) బలిజపల్లి స్కూల్‌లో టెన్త్ చదువుతున్నాడు. పోటీల్లో భాగంగా వాలీబాల్ ఆడుతూ పునీత్ గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతిచెందిటన్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ ఇచ్చారు.

News December 8, 2024

MBNR: ఓపెన్ ఇంటర్, టెన్త్.. APPLY చేసుకోండి

image

విద్యార్థులు అనేక కారణాలతో చదువులకు దూరమైతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓపెన్ స్కూల్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఓపెన్ ఇంటర్ 57, SSC 57 స్టడీ సెంటర్లు ప్రభుత్వం నిర్వహిస్తుంది. అడ్మిషన్లు పొందిన వారికి ప్రభుత్వమే పుస్తకాలు, తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11 వరకు ఫైన్ తో స్పెషల్ అడ్మిషన్లు పొందవచ్చని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య తెలిపారు.

News December 8, 2024

MBNR: నేడు అథ్లెటిక్స్, యోగా క్రీడాకారుల ఎంపిక

image

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు అథ్లెటిక్స్ యోగాలో స్త్రీ, పురుషుల విభాగంలో ఆదివారం ఎంపికలు నిర్వహిస్తున్నట్లు PD శ్రీనివాసులు తెలిపారు. అథ్లెటిక్స్ విభాగంలో జంప్స్, రన్స్, త్రోస్.. యోగా విభాగంలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు తదితర ఆసనాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతో హాజరు కావాలన్నారు. PU పరిధిలోని అన్ని కళాశాలల క్రీడాకారులు పాల్గొనవచ్చని చెప్పారు.