News September 10, 2024
పాలమూరు జిల్లా వర్షపాత వివరాలు
గడచిన 24 గంటల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల జిల్లా కేంద్రంలో 4.8 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లాలోని చిన్న చింతకుంటలో 3.5 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా జఠప్లోల్‌లో 2 మి.మీ, నారాయణపేట జిల్లా జక్లేర్లో 5.8 మి.మీ, వనపర్తి జిల్లా వెల్గొండలో 5.8 మి.మీల వర్షపాతం నమోదయింది.
Similar News
News October 12, 2024
ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి ముఖ్యాంశాలు
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా విజయదశమి వేడుకలు.
✓ అలంపూర్: కన్నుల పండుగగా తెప్పోత్సవం.
✓ అలంపూర్: జోగులాంబను దర్శించుకున్న డీజీపీ జితేందర్.
✓ కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించి దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.
✓ కల్వకుర్తి: ఉప్పొంగిన దుందుభి వాగు రాకపోకలు బంద్.
✓ రేపు కోడంగల్ రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
✓ ఉమ్మడి జిల్లాలో ఘనంగా బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలు.
News October 12, 2024
MBNR: కుంటలో పడి అన్నదమ్ములు మృతి
దసరా వేళ మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నీట మునిగి అన్నదమ్ములు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. మూసాపేట మండలం స్ఫూర్తి తండాకు చెందిన సక్రు నాయక్ పిల్లలు సాయి(12), సాకేత్(10). సాయి చక్రాపూర్ గ్రామంలో, సాకేత్ MBNRలో చదువుతుండగా దసరా సెలవులకు ఊరికొచ్చారు. ఇవాళ సాయంత్రం ఇంటి సమీపంలో ఉన్న నీటి కుంటలో పడి మృతిచెందారు. స్థానికులు గమనించి కుంట నుంచి మృతదేహాలను బయటకు తీశారు.
News October 12, 2024
దసరా వేడుకలు.. పంచ కట్టులో రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తన సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో శనివారం ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన గ్రామస్థులు, అభిమానులతో కలిసి జమ్మి చెట్టు వద్దకు కాలినడకగా వెళ్లారు. ఎంపీ మల్లు రవి, MLAలు, తన మనవడు, కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు.