News March 27, 2025
పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.
Similar News
News October 21, 2025
కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం: రేవంత్

TG: నిజామాబాద్లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి CM రేవంత్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. HYDలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ప్రసంగించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం ప్రకటించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.
News October 21, 2025
MBNR: డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ 3, 5 సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్లాగ్) పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 24 వరకు చెల్లించాలని, ఈనెల 29 వరకు ఫైన్ (లేట్ ఫీజు)తో ఫీజులు చెల్లించాలని తెలిపారు. అలాగే మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ ఫీజును ఎలాంటి ఫైన్ లేకుండా ఈనెల 25 వరకు, లేట్ ఫీజుతో ఈనెల 29 వరకు పరీక్షల ఫీజులు చెల్లించాలని కోరారు.
News October 21, 2025
జగిత్యాల: ఉరివేసుకొని యువకుడి సూసైడ్

జగిత్యాల(D) ధర్మపురి మండలం దమ్మన్నపేటకి చెందిన జగిశెట్టి సచిన్(29) ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సచిన్కు చిన్నతనంలో చేతికి తగిలిన గాయం కారణంగా ప్రస్తుతం ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. ఇందుకోసం హైదరాబాద్లో వైద్యం చేయించారు. 6 నెలల వరకు ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే అనారోగ్యం కారణంతో సచిన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.