News March 27, 2025
పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.
Similar News
News December 1, 2025
శ్రీశైలంలో నేటి నుంచి ఉచిత లడ్డూ ప్రసాదం

శ్రీశైలం మల్లికార్జున స్వామి క్షేత్రంలో సోమవారం నుంచి భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పథకం ప్రారంభం కానుంది. అతిశీఘ్ర దర్శనం (రూ.300) టికెట్ కొనుగోలు చేసిన వారికి ఒక లడ్డూను, స్వామివారి స్పర్శ దర్శనం (రూ.500) టికెట్ దారులకు రెండు లడ్డూలను ఉచితంగా అందజేస్తారు. అలాగే, డొనేషన్ కౌంటర్, ఛైర్మన్ ఛాంబర్, కైలాస కంకణాల కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు, శ్రీగోకులం ఆధునికీకరణ పనులకు భూమి పూజ చేయనున్నారు.
News December 1, 2025
నేటి నుంచి ప్రజాపాలన ఉత్సవాలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో నేటి నుంచి ఆరు రోజుల పాటు పలు ఉమ్మడి జిల్లాల్లో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహించనుంది. ఇవాళ ఉమ్మడి MBNRలోని మక్తల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. CM రేవంత్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
News December 1, 2025
బాలానగర్కు ఆ పేరెలా వచ్చిందంటే..!

బాలానగర్ మండల కేంద్రం పూర్వం నాయన పల్లి ప్రసిద్ధి చెందింది. రాజా బాలచంద్ ఈ ప్రాంత వాతావరణంకి ముగ్ధుడై కొన్ని సంవత్సరాలపాటు పరిపాలించాడు. ఆయన పేరు మీదుగా బాలానగర్ అనే పేరు మారింది. ఇప్పటికీ శిథిలమైన విశ్రాంతి గృహం ఉంది. 300 ఏళ్ల పూర్వం ఈ ప్రాంతాన్ని కడపటి రెడ్డి రాజులు పరిపాలించారు. దీంతో చుట్టుపక్కల రంగారెడ్డి గూడ, కేతిరెడ్డిపల్లి, ముదిరెడ్డిపల్లి పేరుతో గ్రామాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి.


