News March 27, 2025
పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.
Similar News
News November 15, 2025
ECపై ఆరోపణలను కొట్టిపారేయలేం: స్టాలిన్

బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన నితీశ్ కుమార్కు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు RJD నేత తేజస్వీ యాదవ్ క్యాంపైన్ చేసిన తీరును మెచ్చుకున్నారు. ‘ఈ ఫలితాల నుంచి ఇండీ కూటమి నేతలు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అలాగే ఈ ఫలితాలతో ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేం. పౌరులు మరింత పారదర్శక ఎన్నికల సంఘానికి అర్హులు’ అని తెలిపారు.
News November 15, 2025
అమ్రాబాద్: పులుల లెక్కింపునకు వాలంటీర్ల ఆసక్తి

కవ్వాల్, అమ్రాబాద్, వికారాబాద్ రిజర్వ్ ఫారెస్ట్లలో అటవీశాఖ చేపట్టిన పులుల లెక్కింపునకు వాలంటీర్ల నుంచి భారీ స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మంది స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధిక మంది వాలంటీర్లు ముఖ్యంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారని అటవీశాఖ అధికారులు తెలిపారు.
News November 15, 2025
విశాఖలో రెండో రోజు CII సమ్మిట్

విశాఖలో CII సమ్మిట్ నేటితో ముగియనుంది. నిన్న సుమారు 400 MOUలు జరగ్గా.. నేడు గూగుల్, శ్రీ సిటీ, రేమండ్, ఇండోసోల్ వంటి ప్రాజెక్టుల శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో CM చంద్రబాబు భేటీ కానున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సస్టైనబుల్ సిటీస్, ‘ఆంధ్ర టూరిజం విజన్’ సెషన్లు చేపట్టనున్నారు. మంత్రి లోకేశ్ అధ్యక్షతన ‘AI అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’పై ముఖ్య చర్చ జరగనుంది.


