News January 24, 2025

పాలమూరు నుంచి డిండికి నీటి మళ్లింపు

image

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి డిండికి నీటి మళ్లింపు నిర్ణయం ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆమోదం తెలపడం, తాజాగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంత జరుగుతున్నా జిల్లా MLAలు, ప్రజాప్రతినిధుల మౌనం జిల్లా వాసులను కలవర పెడుతోంది. దీనిపై ఆందోళనలు ఉద్ధృతం చేసేందుకు పాలమూరు అధ్యయన వేదిక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News January 25, 2025

MBNR: రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం : ఎమ్మెల్యే

image

రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా క్రీడా మైదానంలో రూ.13 లక్షలతో నిర్మించిన డ్రెస్సింగ్ (కబడ్డీ క్రీడాకారిణిలకు) రూమ్, క్రీడా సామగ్రి స్టోర్ రూమును ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికితీసి జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులను పరిచయం చేయాలని అన్నారు.

News January 24, 2025

MBNR: తెలంగాణ విధ్వంసానికి కారణం కల్వకుంట్ల కుటుంబమే: ఎమ్మెల్యే

image

కల్వకుంట్ల కుటుంబంలోని ఆ నలుగురే తెలంగాణ విధ్వంసానికి కారణమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజంఎత్తారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో చేస్తున్న అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అర్థం అవుతుందని ధీమా వ్యక్తంచేశారు.

News January 24, 2025

MBNR: రాష్ట్రంలోనే నంబర్ 1 కాలేజీగా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే

image

మహబూబ్ నగర్ లోని జేపీ ఐటీఐ కళాశాల భవననిర్మాణానికి రూ.కోటి మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కళాశాలను ఎమ్మెల్యే సందర్శంచి, కళాశాలలోని పరిసరాలను పరిశీలించారు. అవసరమైన మౌలిక సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కళాశాలకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలోనే నంబర్ వన్ కాలేజీగా అభివృద్ధి చేస్తానన్నారు.