News January 24, 2025
పాలమూరు నుంచి డిండికి నీటి మళ్లింపు

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి డిండికి నీటి మళ్లింపు నిర్ణయం ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆమోదం తెలపడం, తాజాగా నీటి తరలింపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంత జరుగుతున్నా జిల్లా MLAలు, ప్రజాప్రతినిధుల మౌనం జిల్లా వాసులను కలవర పెడుతోంది. దీనిపై ఆందోళనలు ఉద్ధృతం చేసేందుకు పాలమూరు అధ్యయన వేదిక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 16, 2025
వనపర్తిలో 17న మూడో విడత ఎన్నికలు

వనపర్తి జిల్లాలో ఈ నెల 17న (బుధవారం) మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు పానుగల్, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, పెబ్బేరు, చిన్నంబావి మండలాల్లో జరగనున్నాయి. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని, ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 16, 2025
అనకాపల్లి: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు: DIEO

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్మీడియటి మొదటి రెండో సంవత్సరం వార్షిక పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరోసారి పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించింది. తత్కాల్ స్కీం ద్వారా ఈనెల 22 నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు నిర్ణీత పరీక్ష ఫీజుకు రూ.5000 విద్యార్థులు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని అనకాపల్లి DIEO మద్దిల వినోద్ బాబు కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు తెలిపారు.
News December 16, 2025
మక్తల్: సర్పంచ్ ఎన్నికలు.. క్షుద్ర పూజల కలకలం

మక్తల్ మండలంలోని కాచ్వార్ గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. ఎన్నికల సందర్భంగా ఒక పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి మామ.. ప్రత్యర్థి పార్టీల సర్పంచ్, వార్డు సభ్యుల ఇళ్ల ముందు నవధాన్యాలు, కుంకుమ, పసుపుతో క్షుద్ర పూజలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీ నాయకులు ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.


