News January 24, 2025
పాలమూరు నుంచి డిండికి నీటి మళ్లింపు

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి డిండికి నీటి మళ్లింపు నిర్ణయం ఉమ్మడి జిల్లాలో హాట్టాపిక్గా మారింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆమోదం తెలపడం, తాజాగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంత జరుగుతున్నా జిల్లా MLAలు, ప్రజాప్రతినిధుల మౌనం జిల్లా వాసులను కలవర పెడుతోంది. దీనిపై ఆందోళనలు ఉద్ధృతం చేసేందుకు పాలమూరు అధ్యయన వేదిక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 8, 2025
తిరుచానూరు: అర్చకుల ముసుగులో ఒక్కరు కాదు ఇద్దరు

ఆలయంలో అర్చకులు అంటే భక్తులకు చాలా గౌరవం. కానీ టీటీడీ పరిధిలోని తిరుచానూరు ఆలయంలో పనిచేసే అర్చకుల ముసుగులో ఇద్దరు అనధికారికంగా ఉన్నట్లు టీటీడీ విజిలెన్స్ గుర్తించింది. ఎప్పటి నుంచి ఉన్నారు..? ఎవరి ద్వారా ఆలయంలో ఉన్నారు..? ఇంత జరుగుతున్నా ఎందుకు అధికారులు గుర్తించలేదనే వివరాలు నమోదు చేశారని తెలుస్తోంది. నేడో.. రేపో నివేదిక ఉన్నతాధికారులకు అందించనున్నారని సమాచారం.
News December 8, 2025
ఫ్యూచర్ సిటీలోని ప్రదర్శన స్టాల్ వద్ద సందడి!

ఫ్యూచర్ సిటీలో ప్రదర్శన స్టాల్ ముఖ్య ఆకర్షణగా నిలిచింది. మీర్ఖాన్పేటలో ప్రతిపాదించిన ఈ భవిష్యత్తు నగర ప్రణాళికలను డిజిటల్ విజువల్స్ ద్వారా ప్రదర్శించారు. వంపు ఆకృతి నిర్మాణంతో కూడిన ఈ స్టాల్లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్టాల్ను సందర్శించారు.
News December 8, 2025
రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా జట్టు ఘన విజయం

గుంటూరులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రికెట్ పోటీల్లో ఈస్ట్ గోదావరిపై కడప జట్టు 26 పరుగుల తేడాతో గెలిచింది. కడప 16 ఓవర్లలో 171 పరుగులు చేయగా.. ఈస్ట్ గోదావరి 145 పరుగులకే ఆలౌటైంది. బ్యాటర్ ప్రవీణ్ 41 బంతుల్లో 85 పరుగులతో వీరవిహారం చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ వెంకటయ్య, వైస్ కెప్టెన్ సుబ్బరాయుడు ప్రవీణ్ను అభినందించారు. క్రీడాకారులను పలువురు ప్రశంసించారు.


