News April 10, 2025
పాలమూరు: నేడు భారీ వర్షం.. ఎల్లో హెచ్చరిక జారీ

ఉమ్మడి MBNRజిల్లాలో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈమేరకు MBNR, NGKL జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. GDWL, NRPT, WNPలో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇటీవల పాలమూరులో పిడుగు పాటుకు ఒకేరోజు ఐదుగురు మరణించారు. జర జాగ్రత్త. SHARE IT
Similar News
News December 2, 2025
రేపటి నుంచి సింహాచలం నృసింహ దీక్షలు ప్రారంభం

సింహాచలంలో డిసెంబర్ 3వ తేదీ నుంచి నృసింహ దీక్షలు ప్రారంభం కానున్నట్లు ఈవో సుజాత మంగళవారం తెలిపారు. డిసెంబర్ 3 నుంచి జనవరి 12వ తేదీ వరకు ఈ దీక్షలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. మొదటి విడత దీక్షలు డిసెంబర్ 3 నుంచి, రెండో విడత దీక్షలు డిసెంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పై తేదీలలో మాల ధరించే భక్తులకు తులసి మాలలు, స్వామివారి ప్రతిమ ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు.
News December 2, 2025
HYD: రైల్వే ఫుడ్లో బొద్దింక.. ప్రయాణికుల ఆగ్రహం

నాగపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తున్న ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశారు. రైల్వే ఫుడ్ ఓపెన్ చేసి తినే సమయంలో ఒక్కసారిగా దాంట్లో బొద్దింక కనబడటంతో షాక్ అయ్యాడు. వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆహార నాణ్యతపై చర్యలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులను డిమాండ్ చేశారు.