News February 13, 2026

పాలమూరు: పుర ‘పోరు’.. నేడే ఫలితాలు

image

తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్‌ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని MBNR కార్పొరేషన్‌తోపాటు భూత్‌పూర్, దేవరకద్ర, కోస్గి, మద్దూర్, మక్తల్, నారాయణపేట, అమరచింత, ఆత్మకూరు, కొత్తకోట, పెబ్బేర్, వనపర్తి, కల్వకుర్తి, కొల్లాపూర్, NGKL, అలంపూర్, గద్వాల, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది.

Similar News

News April 14, 2026

అన్ని వర్గాల హక్కుల ప్రదాత రాజ్యాంగ నిర్మాత: లోకేశ్

image

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని మంత్రి లోకేశ్ తన ఉండవల్లి నివాసంలో నివాళులర్పించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, దేశాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని లోకేశ్ కొనియాడారు. రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు.

News April 14, 2026

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’.. టీజర్ పోస్టర్

image

‘స్పైడర్ మ్యాన్’ సిరీస్‌లో భాగంగా తెరకెక్కిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ నుంచి కొత్త టీజర్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. జులై 31న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్లను షురూ చేశారు. ఈ చిత్రానికి డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహిస్తుండగా పీటర్ పార్కర్ పాత్రలో మరోసారి టామ్ హాలండ్ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన <<19417934>>ట్రైలర్<<>> మూవీపై అంచనాలను పెంచింది.

News April 14, 2026

ఏపీ నుంచి ధాన్యం రాకుండా నిషేధాజ్ఞలు

image

TG: వరి ధాన్యం సేకరణ ప్రారంభమైన నేపథ్యంలో GOVT ఆంధ్ర వరిపై ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి TGలోకి ధాన్యం రాకుండా సరిహద్దుల్లో సిబ్బందిని మోహరించారు. సన్నరకం వరిపై ₹500 బోనస్ చెల్లిస్తుండడంతో కొందరు వ్యాపారులు AP ధాన్యాన్ని తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్రంపై ఆర్థిక భారం పెరిగిపోతోంది. దీంతో ఏపీ రైతులు తమ వరిని ఆ రాష్ట్రంలోనే అమ్ముకోవాలని సూచిస్తూ TGలోకి రాకుండా ఏర్పాట్లు చేశారు.