News September 20, 2024

పాలమూరు ప్రజలపై నెలకు రూ.3.60 కోట్ల భారం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సగటున నెలకు 18 లక్షల కిలోల వంట నూనెలను ప్రజలు వాడుతున్నారు. ఇటీవలే కేంద్రం దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఒక్కసారిగా వంట నూనెల ధరలు పెరిగాయి. నూనెల ధరలు సరాసరి ఒక్కో లీటరుపై రూ.20 పెరుగుదల అనుకుంటే..రూ.3.60 కోట్లు ప్రజలు అదనంగా ఖర్చు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వంటనూనెల పెరుగుదల సంకటంగా మారింది.

Similar News

News December 2, 2025

పాలమూరు: ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలి

image

సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఓటర్లు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తమ పోలీస్ అధికారులకు సహకరించాలని ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సమస్యలు వచ్చిన తమ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 2, 2025

రేపటి నుంచి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

image

దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఈవో శ్యాంసుందర్ సోమవారం తెలిపారు. దాదాపు 5 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేలా తగు చర్యలు తీసుకున్నామన్నారు. డిసెంబర్ 6వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.

News December 1, 2025

MBNR: మహిళలను వేధిస్తే 8712659365 కాల్ చేయండి

image

పనిచేసే ప్రదేశంలో, విద్యార్థులు చదువుకునే ప్రాంతాలలో ఎవరైనా మహిళలను వేధిస్తే వెంటనే 8712659365 నంబర్‌కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ఎల్లప్పుడూ మహిళల రక్షణ కోసం తమ షీ టీం బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతామని సూచించారు. విద్యార్థినీలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.