News September 20, 2024

పాలమూరు ప్రజలపై నెలకు రూ.3.60 కోట్ల భారం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో సగటున నెలకు 18 లక్షల కిలోల వంట నూనెలను ప్రజలు వాడుతున్నారు. ఇటీవలే కేంద్రం దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఒక్కసారిగా వంట నూనెల ధరలు పెరిగాయి. నూనెల ధరలు సరాసరి ఒక్కో లీటరుపై రూ.20 పెరుగుదల అనుకుంటే..రూ.3.60 కోట్లు ప్రజలు అదనంగా ఖర్చు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వంటనూనెల పెరుగుదల సంకటంగా మారింది.

Similar News

News October 12, 2024

జోగులాంబ సన్నిధిలో డీజీపీ జితేందర్

image

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దేవి శరన్నవరాత్రి ఉత్సవాల విజయదశమిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. జోగులాంబదేవి కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

News October 12, 2024

కొండారెడ్డిపల్లికి చేరుకనన్న సీఎం రేవంత్ రెడ్డి

image

వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దసరా సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన సీఎంకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వాకిటి శ్రీహరి, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. గ్రామస్థులు బోనాలు, బతుమ్మలు, కోలాటాలతో స్వాగతం పలికారు. సీఎం రాకతో కొండారెడ్డిపల్లికో పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.

News October 12, 2024

పాలపిట్ట, జమ్మి పత్రాల ప్రత్యేకత ఇదే..

image

దసరా పండుగ సందర్భంగా జమ్మి పత్రాలకు, పాలపిట్టకు చాలా ప్రత్యేకత ఉందని పండితులు అంటున్నారు. జమ్మి పత్రాలకు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఒకరికి ఒకరు పుచ్చుకొని అలైబలై చేసుకోవడం ద్వారా శత్రుత్వం కోల్పోతుందన్నారు. పాలపిట్టను చూడడం ద్వారా అపజయాలు కోల్పోయి విజయాలు దరిచేరుతాయని, పల్లెల్లో ప్రజలు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని పొలాల వెంబడి వెళ్లి పాలపిట్టను చూస్తారని పండితులు తెలిపారు.