News April 8, 2025
పాలమూరు: బుడియా బాపు ప్రత్యేకత (2/2)

బుడియా బాపుకు పాలమూరు బంజారాల సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. సంతానం లేని దంపతులు బుడియా బాపును భక్తితో పూజిస్తే సంతానం కలుగుతుందని గట్టి నమ్మకం. వ్యవసాయం బాగా పండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని బుడియా బాపును ప్రార్థిస్తారు. నల్గొండ జిల్లా రంగుండ్ల గ్రామంలో బుడియా బాపు జీవ సమాధి అయ్యారని బంజారా ప్రజలు చెబుతున్నారు. తిరుమల తిరుపతి శ్రీవారితో బుడియా బాపుకు ఎంతో అనుబంధం కలిగి ఉందని చెబుతుంటారు.
Similar News
News December 5, 2025
ఖమ్మం మార్కెట్‌కు రేపు, ఎల్లుండి సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు శని, ఆదివారాలు (డిసెంబర్ 6, 7) వారంతపు సెలవుల కారణంగా మార్కెట్ శాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరగవని తెలిపారు. తిరిగి ఈ నెల8వ తేదీ (సోమవారం) నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
News December 5, 2025
తిరుపతి: ఆయిల్ ఫామ్‌తో ప్రయోజనాలివే.!

ఆయిల్ ఫాం ప్రపంచంలోనే అత్యధికంగా నూనె ఉత్పత్తి చేసే పంటని తిరుపతి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి తెలిపారు. ప్రతి ఎకరాకు సుమారు 4 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఫామ్ ఆయిల్ అందిస్తుందని, ఇది ఇతర నూనె గుంజల పంటలతో పోలిస్తే 4నుంచి 10రెట్లు అధికంగా ఉంటుందని అన్నారు. ఒకసారి నాటిన తర్వాత ఆయిల్ ఫామ్ పంట 25 సంవత్సరాల వరకు రైతులకు నిరంతరం ఆదాయం ఇస్తుందన్నారు.
News December 5, 2025
చిత్తూరు: ‘తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి’

పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చిత్తూరు మండలంలోని తుమ్మింద జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం పోటీ తత్వం ఎక్కువగా ఉందని విద్యార్థులు రాణించాలంటే క్రమశిక్షణతో కూడిన పట్టుదల, కృషి అవసరమన్నారు.


