News April 15, 2025
పాలమూరు: మత్తు మందు ఇచ్చి.. బాలికపై అత్యాచార యత్నం!

ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. MBNR మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కోయిలకొండలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు HYD నుంచి ఒంటరిగా వచ్చింది. MBNR చేరుకున్న ఆమె ఓ యువకుడి బైక్ ఎక్కి ఊరికి వెళ్తుండగా మార్గం మధ్యలో మత్తు మందు ఇచ్చి బాలికపై అత్యాచారానికి యత్నించాడు. తప్పించుకున్న ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Similar News
News December 5, 2025
పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.
News December 5, 2025
VZM: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు.. అంతలోనే ఆత్మహత్య.!

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం విజయనగరంలోని దాసన్నపేటలో జరిగింది. కోరాడ వీరేంద్ర (25) సింహాచలంలో నేడు పెళ్లి జరగాల్సి ఉంది. ముహూర్తాలు లేకున్నా పెళ్లి చేసుకోవాలని ప్రేమించిన యువతి ఒత్తిడి చేయడమే ఆత్మహత్యకు ప్రాథమిక కారణంగా తెలుస్తోంది. పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పినా,వీరేంద్ర ఎందుకు ఇలా చేశాడో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 5, 2025
సీఎం ఓయూ పర్యటన వాయిదా

TG: ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న ఓయూకు వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పులు జరిగాయి. ఎల్లుండికి బదులుగా ఈ నెల 10న సీఎం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు.


