News April 15, 2025

పాలమూరు: మత్తు మందు ఇచ్చి.. బాలికపై అత్యాచార యత్నం!

image

ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. MBNR మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కోయిలకొండలోని వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు HYD నుంచి ఒంటరిగా వచ్చింది. MBNR చేరుకున్న ఆమె ఓ యువకుడి బైక్ ఎక్కి ఊరికి వెళ్తుండగా మార్గం మధ్యలో మత్తు మందు ఇచ్చి బాలికపై అత్యాచారానికి యత్నించాడు. తప్పించుకున్న ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Similar News

News December 9, 2025

VZM: జీజీహెచ్ సేవల మెరుగుదలపై అధికారుల సమీక్ష

image

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జీజీహెచ్ అభివృద్ధి సొసైటీ సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, MLA పూసపాటి అదితి విజయలక్ష్మి పాల్గొని ఆసుపత్రిలో పెరుగుతున్న రోగుల రద్దీ, అవసరమైన మౌలిక వసతులు, పరికరాల అప్‌గ్రేడేషన్, శుభ్రత, వైద్యసిబ్బంది బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, ఇతర వైద్య అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

News December 9, 2025

స్క్రబ్ టైపస్‌తో జాగ్రత్త: కలెక్టర్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో స్క్రబ్ టైపస్ బ్యాక్టీరియా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ పిలుపునిచ్చారు. అమలాపురంలోని కలెక్టరేట్‌లో మంగళవారం వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ బ్యాక్టీరియా పంట పొలాలు, తేమ ఉన్న ప్రదేశాలలో వ్యాప్తి చెందుతుందని తెలిపారు. వ్యాధి నివారణ మార్గాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో కీలక చర్చలు జరిగాయి.

News December 9, 2025

అధికారం కోల్పోయాక విజయ్ దివస్‌లు.. BRSపై కవిత విమర్శలు

image

TG: బీఆర్ఎస్‌పై జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఇవాళ ఆ పార్టీ ‘విజయ్ దివస్’ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె సంచలన ట్వీట్ చేశారు. ‘అధికారం కోల్పోయాక దీక్షా దివస్‌లు.. విజయ్ దివస్‌లు. ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు!!’ అని రాసుకొచ్చారు. పార్టీ నుంచి బయటికొచ్చాక బీఆర్ఎస్‌పై కవిత తరచూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.