News October 25, 2024
పాలమూరు మామిడి రైతుకు మంచి రోజులు

ఉమ్మడి పాలమూరు జిల్లాను కేంద్ర ప్రభుత్వం ‘మామిడి క్లస్టర్’ గా ఎంపిక చేసింది. దీని కోసం రూ.100 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది. తెగుళ్ల నివారణ, నాణ్యమైన అధిక దిగుబడి పొందేందుకు మామిడి రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా NGKL జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లె, కల్వకోలు గ్రామాల్లో 1000 ఎకరాల్లో మామిడి తోటలపై ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు.
Similar News
News October 28, 2025
MBNR: సౌత్ జోన్.. PU కబడ్డీ జట్టు READY

సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు పాలమూరు వర్సిటీ స్త్రీల కబడ్డీ జట్టు చెన్నైలోని వినాయక మిషన్ ఫౌండేషన్ వర్సిటీకి బయలుదేరింది. వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొ.జిఎన్ శ్రీనివాస్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేశారు. యూనివర్సిటీకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ రమేష్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ వై.శ్రీనివాసులు, కోచ్ వెంకటేష్, మేనేజర్ ఉష పాల్గొన్నారు.
News October 27, 2025
MBNR: గంజాయి విక్రయంపై దాడి.. నలుగురి అరెస్ట్

మహబూబ్నగర్ RNCC యూనిట్, ఈగల్ టీం, జడ్చర్ల పోలీసుల సంయుక్తంగా మాచారం గ్రామం (NH–44 హైవే వద్ద) జడ్చర్ల టౌన్ PS పరిధి గంజాయి విక్రయంపై ప్రత్యేక దాడి నిర్వహించింది. జడ్చర్ల టౌన్ CI కమలాకర్ వివరాల ప్రకారం.. గంజాయి విక్రయంపై దాడిలో నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేశామని, వారి నుంచి మొత్తం 241 గ్రాముల గంజాయి, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచామన్నారు.
News October 27, 2025
MBNR: రిపబ్లిక్ డే.. కంటింజెంట్ అధికారిగా అర్జున్ కుమార్

గణతంత్ర దినోత్సవ వేడుకలలో నిర్వహించే పరేడ్ వేడుకకు కంటింజెంట్ ఆఫీసర్గా పీయూ అధ్యాపకుడు డాక్టర్ ఎస్ఎన్.అర్జున్ కుమార్ ఎంపిక కావడం గర్వకారణమని వీసీ ఆచార్య జిఎన్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పరిపాలన భవనంలో VCతోపాటు రిజిస్ట్రార్ రమేష్ బాబు,ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె ప్రవీణ అభినందించారు. గుజరాత్ విశ్వవిద్యాలయంలో ఈనెల 31 నుంచి నవంబర్ 9 వరకు ప్రీ-రిపబ్లిక్ డే శిబిరానికి వెళ్లనున్నారు.


