News March 27, 2025

పాలమూరు యూనివర్సిటీలో ఉగాది వేడుకలు ప్రారంభం

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో గురువారం ఉగాది వేడుకలను యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలో విశ్వావసు నామా సంవత్సరంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని కాంశించారు. కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News November 27, 2025

వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం.. లాక్ డౌన్

image

వాషింగ్టన్‌(US)లోని వైట్ హౌస్ వద్ద కాల్పులు కలకలం రేపాయి. దుండగుల కాల్పుల్లో ఇద్దరు జాతీయ భద్రతాదళ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల నేపథ్యంలో వైట్ హౌస్‌ను లాక్ డౌన్ చేశారు. ఘటన జరిగినప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్నారు. దేశ రాజధానిలో నేరాల కట్టడికి ట్రంప్ వాషింగ్టన్ అంతటా వేలాది మంది సైనికులను మోహరించిన తరుణంలో కాల్పులు జరగడం గమనార్హం.

News November 27, 2025

కృష్ణా నదీ జలాలపై హక్కులను వదులుకోం: సీఎం

image

AP: కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర హక్కులను వదులుకునేది లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని జలవనరుల శాఖ అధికారుల సమీక్షలో దిశానిర్దేశం చేశారు. నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులకు వీలులేదని, చట్టపరంగా దక్కిన వాటాను కొనసాగించాల్సిందేనని చెప్పారు. ఏటా వేలాది <<16807228>>TMC<<>>ల జలాలు సముద్రంలో కలుస్తున్నందున వరద జలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా వ్యవహరించాలన్నారు.

News November 27, 2025

KTDM: పోలీస్ స్టేషన్‌లో ఒక్కటైన ‘మూగ’ జంట

image

ప్రేమకు మాటలు అక్కర్లేదని నిరూపిస్తూ బూర్గంపాడు పోలీస్ స్టేషన్ వేదికగా మూగ, చెవిటి వైకల్యంతో బాధపడుతున్న ఓ జంట ఒక్కటయ్యింది. పెళ్లి కోసం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, పోలీసులు ఇరు కుటుంబాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించారు. చివరకు పోలీసుల సమక్షంలోనే ఆ జంట దండలు మార్చుకుంది. అక్కడ పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసేవారిలా కాకుండా, మనసున్న మారాజులుగా వ్యవహరించారు.