News March 27, 2025
పాలమూరు యూనివర్సిటీలో ఉగాది వేడుకలు ప్రారంభం

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో గురువారం ఉగాది వేడుకలను యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఆచార్య శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సరస్వతి దేవికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలో విశ్వావసు నామా సంవత్సరంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని కాంశించారు. కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News April 23, 2025
వీరయ్య చౌదరికి CM నివాళి

నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులోని వీరయ్య చౌదరి నివాసానికి CM చంద్రబాబు చేరుకున్నారు. వీరయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.
News April 23, 2025
మాజీ ఎంపీపీ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా: ఎమ్మెల్యే పుల్లారావు

కూటమి ప్రభుత్వంలో హత్యలు, అరాచకాలకు తావులేదని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం అన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి, సంతనూతలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. వారి వెనకున్న వారు ఎవరైనా ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. కూటమి ప్రభుత్వం దోషులను గుర్తించి త్వరలోనే వారికి కఠిన శిక్ష పడేలా చేస్తుందన్నారు.
News April 23, 2025
రొంపిచర్ల: పదో తరగతి ఒకేసారి పాసైన తండ్రి, కూతురు

రొంపిచర్ల గ్రామపంచాయతీ పాలెం వీధికి చెందిన తండ్రి, కూతురు పదో తరగతి పరీక్షలు రాసి ఒకే సారి పాసైన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 1995-96 సంవత్సరంలో 10 పరీక్షలు రాసిన బి.షబ్బీర్ ఫెయిల్ అయ్యారు. అప్పట్లో ప్రమాదవశాత్తు గాయపడి దివ్యాంగుడిగా మారాడు. ఏదైనా ఉద్యోగం సాధించాలని కుమార్తెతో పాటు పదో తరగతి పరీక్షలు రాశాడు. తండ్రి బి.షబ్బీర్‌కు 319 మార్కులు, కుమార్తె బి.సమీనాకు 309 మార్కులు వచ్చాయి.