News April 17, 2025
పాలమూరు యూనివర్సిటీలో సకోర అభియాన్ కార్యక్రమం

సకోర అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాలమూరు యూనివర్సిటీ రిజిస్టర్ రమేశ్ బాబు పక్షులకు నీటి తొట్లు అందించి జీవారణాన్ని కాపాడాలన్నారు. పీజీ ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. వచ్చే ఎండాకాలంలో పశుపక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందిస్తూ ప్రాణకోటిపై దయా హృదయంతో మెలగాలని విద్యార్థులకు సూచించారు. ప్రకృతిలో ఎన్నో జీవరాశులు అంతమవడానికి పరోక్షంగా మానవాళి చర్యలే కారణమన్నారు. ఇందులో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Similar News
News February 24, 2026
భద్రాచలానికి మినీ స్టేడియం.. ఖమ్మంలో టీటీడీ దివ్యక్షేత్రం

భద్రాచలంలో గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం నిర్మాణానికి 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం ధంసలాపురంలో టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం నిర్మాణానికి 20 ఎకరాల భూమిని కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆధ్యాత్మిక, క్రీడా రంగాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయన్నారు.
News February 24, 2026
నేటి నుంచి జగన్ పులివెందుల పర్యటన

AP: YSRCP అధినేత YS జగన్ నేటి నుంచి 2రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈరోజు అక్కడికి చేరుకుని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్‌లో పాల్గొంటారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. రేపు ఉదయం వేంపల్లి మండలం నందిపల్లిలోని నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం తిరిగి పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌కు హాజరై స్థానిక నేతలతో భేటీ అవుతారు.
News February 24, 2026
VJA: బాలికను మోసం చేసిన యువకుడి రిమాండ్

మైనర్ బాలికను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరుకి చెందిన హేమంత్ సాయి కొత్తపేటకు చెందిన ఓ బాలిక(16)ను మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. ఈ మేరకు ఈ నెల 19న కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ కొండలరావు తెలిపారు.


