News October 18, 2024

పాలమూరు యూనివర్సిటీ VCగా శ్రీనివాస్ నియామకం

image

పాలమూరు యూనివర్సిటీ నూతన ఉపకులపతి(VC)గా ప్రొఫెసర్ GN శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన శ్రీనివాస్.. బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ OUలో పూర్తి చేశారు. ఆయన JNTU ప్రొఫెసర్‌గా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేశారు. OUలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, JNTU సుల్తాన్‌పూర్ ప్రిన్సిపల్‌గా పని చేశారు.

Similar News

News November 8, 2024

ఉమ్మడి పాలమూరులో నేటి..TOP NEWS!!

image

✔రేపు,ఎల్లుండి ఓటర్ నమోదుకు స్పెషల్ డ్రైవ్✔ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. పలుచోట్ల అన్నదానం✔PUలో ఖో-ఖో క్రీడాకారుల ఎంపిక✔ఆత్మకూరు: ఉద్దాల ఊరేగింపు మహోత్సవం ప్రారంభం✔GDWL: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య✔సమగ్ర సర్వేకు ప్రజలందరూ సహకరించాలి: కలెక్టర్లు✔10న కురుమూర్తికి సీఎం రేవంత్ రెడ్డి రాక.. ఏర్పాట్లపై ఫోకస్✔అవినీతిలో ఉమ్మడి పాలమూరు టాప్

News November 8, 2024

PUలో ఖో-ఖో క్రీడాకారుల ఎంపిక

image

పాలమూరు యూనివర్సిటీలో ఖో-ఖో స్త్రీ, పురుషుల విభాగంలో క్రీడాకారులను సౌత్ జోన్(ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్)లో పాల్గొనేందుకు శుక్రవారం ఎంపికలు చేసినట్లు యూనివర్సిటి పీడీ వై.శ్రీనివాసులు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు తమిళనాడు, కాలికట్ యూనివర్సిటీలో జరిగే టోర్నీలో పాల్గొననున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కృష్ణయ్య, బాల్రాజ్, రవీందర్, సత్య భాస్కర్ రెడ్డి, మీనా తదితరులు పాల్గొన్నారు.

News November 8, 2024

అలంపూర్ టూ శ్రీశైలం సైకిల్ యాత్ర

image

కార్తీకమాసం సందర్భంగా అలంపూర్ పట్టణ యువకులు ఈరోజు శుక్రవారం 100 మందితో శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం నుంచి శ్రీశైలం సైకిల్ యాత్రగా వెళ్లారు. ప్రతి సంవత్సరం సైకిల్ యాత్ర కమిటీ వేసుకుని అన్నదానం కోసం కూడా సైకిల్ లక్కీ లాటరీ ద్వారా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం 15 సంవత్సరాలుగా జరుగుతుందని నిర్వాహకులు ప్రశాంత్, భూపాల్, సుధాకర్, శీను అంజి తదితరులు తెలిపారు.