News March 28, 2025
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం షాక్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం షాకిచ్చింది. జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్ట్గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ ప్రతిపాదనలు పంపింది. కాగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం వెనక్కి పంపింది. కోర్టు వివాదం నేపథ్యంలో తెలంగాణ పంపిన ప్రాజెక్ట్ టెక్నో ఎకనమిక్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తిశాఖ తెలిపింది.
Similar News
News April 8, 2025
అనకాపల్లి: ఈ ఏడాది 132 మంది అరెస్ట్

గంజాయి కేసుల్లో ఈ ఏడాది ఇప్పటివరకు 132 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం తెలిపారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. 42 కేసులు నమోదు కాగా 178 మందిని గుర్తించామని కలెక్టర్కు వివరించారు. 3,090 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 53 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.
News April 8, 2025
నల్లజర్ల: పిడుగుపాటుకు ఒకరి మృతి

నల్లజర్ల మండలంలోని కృష్ణం గూడెం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈదురుగాలులు వీచిన సమయంలో మామిడి చెట్టు కింద ఉన్న వెలగని సత్యనారాయణ అనే వ్యక్తిపై పిడుగు పడి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటన సోమవారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
News April 8, 2025
బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా క్రికెట్, ఇతరత్ర బెట్టింగ్లకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠినంగా వ్యవహరిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువత బెట్టింగ్లపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ప్రకటన చేశారు.