News April 10, 2025
పాలమూరు: 4 రోజులు.. ప్రకృతి అందాలు చూసొద్దాం..!

నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పరిధి సళేశ్వరం లింగమయ్య జాతరను ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జాతరకు ముందే లక్షలాది మంది ప్రజలు తరలివెళ్తున్నారు. కాగా నాలుగు రోజులు సా.6గంటల వరకే అనుమతి ఉంటుందని, ఈ టైమింగ్స్ని దృష్టిలో పెట్టుకుని సిబ్బందికి సహకరించాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ గుడిని ఏటా ఒకసారి మాత్రమే చూసేందుకు అవకాశం లభించడంతో ప్రజలు పోటెత్తారు.
Similar News
News November 25, 2025
ADB: అన్నా మీరు సపోర్ట్ చేస్తే తప్పక గెలుస్తాం..!

స్థానిక ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటించారు. దీంతో ఆశావహులు తమకే మద్దతు తెలపాలని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఉమ్మడి ADBలోని 10 నియోజకవర్గాల్లో కేవలం నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇతర నియోజకవర్గాల్లో వేరే పార్టీల MLAలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతల ఆధిపత్యం కొనసాగడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వరుస కడుతున్నారు.
News November 25, 2025
KUDA ఆధ్వర్యంలో రూ.584 కోట్ల పనులు!

కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో WGL నగరంలో రూ.584 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. KUDA 1,805 స్క్వేర్ కి.మీ ఏరియాలో సేవలు అందిస్తోంది. 181 రెవెన్యూ గ్రామాలతో మొత్తం 13 లక్షల జనాభా ఉంది. ఇప్పటికే రింగ్ రోడ్, కాళోజీ కళాక్షేత్రాలను రూ.352 కోట్లతో నిర్మించగా, తాజాగా రూ.110 కోట్లతో టెంపుల్ టూరిజం పేరిట భద్రకాళి బండ్, మరో రూ.150 కోట్లతో గేట్ వేలు, జంక్షన్లు, బస్టాండ్లను నిర్మించబోతున్నారు.
News November 25, 2025
NLG: ఈ మండలాల్లో ఎస్టీలకు జీరో స్థానాలు!

జిల్లాలో తాజాగా కేటాయించిన రిజర్వేషన్లలో 12 మండలాల్లో ఎస్టీ వర్గానికి ఒక్క సర్పంచ్ స్థానం కూడా రిజర్వు కాలేదు. NKP, తిప్పర్తి, KTP, NLG, చిట్యాల, NKL, SLG, కట్టంగూరు, వేములపల్లి, MNGD, గట్టుప్పల్, చండూరు మండలాల్లో ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కలేదు. ఈ మండలాల్లో ఎస్టీల జనాభా అతి స్వల్పంగా ఉండడం, జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకొని సీట్ల సంఖ్యను ఖరారు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది.


