News September 6, 2024
పాలమూరు: NH-44పై పెరుగుతున్న ప్రమాదాలు !

ఉమ్మడి పాలమూరు నుంచి వెళ్తున్న హైవే- 44 దేశంలోనే ప్రత్యేకమైనది. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో ప్రారంభమై.. తమిళనాడులోని కన్యాకుమారిలో ముగిస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాలోని బాలనగర్ నుంచి అలంపూర్ చౌరస్తా వద్ద ముగుస్తుంది. కాగా జాతీయ రహదారిలో ప్రతి ఏడాది ప్రమాదాలు పెరుగుతున్నాయి. గతేడాది 85 ప్రమాదాలు జరిగ్గా.. 35 మంది చనిపోయారు. 463 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈడాది ఇప్పటికే 10 మందిపైగా చనిపోయారు.
Similar News
News December 9, 2025
జడ్చర్ల: పంచాయతీ ఏర్పడిన ఐదేళ్లకు ఎన్నికలు

జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన తర్వాత 2020 డిసెంబర్ 20 నుంచి ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో గ్రామంలో మూడో విడత ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యలు తీరి గ్రామ సర్పంచ్ పాలనలో గ్రామ అభివృద్ధి చెందిందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.
News December 9, 2025
MBNR: స్వామివారి తలనీలాలకు కోటి రూపాయల టెండర్

తెలంగాణ తిరుపతిగా పేరు ప్రఖ్యాతలుగాంచిన మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం టెండర్లు నిర్వహించారు. పది సంవత్సరాల క్రితం పలికిన విధంగా ఈసారి కూడా కోటి రూపాయలు తలనీలాలకు రెండేళ్ల కాలపరిమితికి ఐదుగురు వ్యాపారులు పాల్గొన్నారు. శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ వారికి దక్కిందని ఆలయ ఈవో శ్రీనివాసరాజు తెలిపారు.
News December 9, 2025
MBNR: ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరుకావాలి: కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధులు కేటాయించిన పి.ఓలు, ఓ.పి.ఓలు ఎన్నికల విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ విజయేందిర బోయి ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై ఎన్నికల నిబంధనల అనుసరించి క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు.


