News June 7, 2024

పాలిటెక్నిక్ కౌన్సిలింగ్‌కు 2,307 మంది హాజరు

image

పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించిన పాలీసెట్ -2024 కౌన్సిలింగ్‌కు మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు 2,307 మంది హాజరయ్యారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో 1,08,001 నుంచి చివరి ర్యాంకు వరకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలన గురువారం నిర్వహించగా, 256 మంది హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీలు 181, ఎస్సీ ఎస్టీలు 75 మంది ఉన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జి.దామోదర్ రావు తెలిపారు.

Similar News

News December 22, 2025

శ్రీకాకుళం జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ దందా

image

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ అండతో కొందరు మాఫియాగా మారి ఇసుక అక్రమ దందా సాగిస్తున్నారు. శివారు గ్రామాలను డంపింగ్ కేంద్రాలుగా మార్చి గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో భారీ లారీలతో ఒడిశా, హైదరాబాద్‌లకు రవాణా చేస్తున్నట్లు ఊహగానాలున్నాయి. దీంతో నదీ పరీవాహక భూములు కోతకు గురవుతున్నాయి. అధికారికంగా 27 ర్యాంపుల్లో 4.50లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలగా, అనధికారకంగా లక్షల క్యూబిక్ మీటర్లు తరలిందని సమాచారం.

News December 22, 2025

శ్రీకాకుళంలో నేడు పీజీఆర్‌ఎస్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి సమస్యలను ఫిర్యాదుల రూపంలో నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.

News December 21, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

✩శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా పల్స్ పోలియో
✩జలమూరు: మా రెండు గ్రామాలను పంచాయతీగా ఏర్పాటు చేయాలి
✩ఆమదాలవలస: పుష్కరిణిలో జారిపడి ఇద్దరు చిన్నారులు మృతి
✩నియోజకవర్గ అభివృద్ధి నా ఎజెండా: ఎమ్మెల్యే అశోక్
✩పలాసలో రక్తదానం చేసిన మాజీ మంత్రి సీదిరి
✩ గొప్పిలిలో వరి కుప్ప దగ్ధం
✩లావేరులో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
✩ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో ప్రపంచ ధ్యాన దినోత్సవం