News August 10, 2024
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు.. రేపే చివరి తేదీ

నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో 2024-25 ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు ఆగస్టు 12 స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సిహెచ్ నర్సింహారావు తెలిపారు. పాలిసెట్ 2024 అర్హత సాధించినవారు, పదో తరగతి, నేషనల్ ఓపెన్ స్కూల్ ఉత్తీర్ణులైన వారు స్పాట్ కౌన్సిలింగ్కు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 11వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News November 24, 2025
ఉత్కంఠకు తెర… రిజర్వేషన్లు ఖరారు!

జిల్లాలో గ్రామపంచాయతీ రిజర్వేషన్ల ఉత్కంఠకు తెరపడింది. జిల్లాలో మొత్తం 869సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం ఖరారు చేసింది. ఇందులో 384 పంచాయతీలను అన్ రిజర్వుడ్, మహిళలకు 186, జనరల్కు 198 స్థానాలు కేటాయించారు. బీసీలకు 140 స్థానాలు రిజర్వుకాగా.. అందులో మహిళలకు 62, జనరల్ కు 78 స్థానాలను కేటాయించారు. ఎస్సీలకు 153, ఎస్టీ కేటగిరిలో 192 స్థానాలు రిజర్వు అయ్యాయి.
News November 24, 2025
నల్గొండ సర్కారు దవాఖానలో వసూళ్ల పర్వం కలకలం..!

నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో వసూళ్ల పర్వం కలకలం రేపుతోంది. ఇక్కడ పనిచేస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఈ దవాఖానలోని పరిపాలన విభాగంలో ఇద్దరు ఉద్యోగులపై ఆరోపణలు వెల్లువెత్తడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిపై విచారణ చేసి ఈనెల 26 లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.
News November 24, 2025
నల్గొండ జిల్లాలో బీసీలకు తగ్గిన స్థానాలు

నల్గొండ జిల్లాలో రిజర్వేషన్ల కేటాయింపులో రొటేషన్ విధానం బీసీలను దెబ్బతీసింది. 2019 ఎన్నికలతో పోలిస్తే భారీ ఎత్తున బీసీ రిజర్వేషన్లు తగ్గిపోవడంపై బీసీల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆదివారం ఆర్డీఓల ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సర్పంచ్ రిజర్వేషన్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 869 జీపీలు ఉండగా.. ఇందులో బీసీలకు 140 (2019లో 164) స్థానాలు రిజర్వ్ అయ్యాయి.


