News April 9, 2025
పాలీసెట్ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి..!

కొత్తగూడెం సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతి వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులకు ఉచిత పాలీసెట్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి గుండా శ్రీనివాస్, పాఠశాల కరస్పాండెంట్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి హైస్కూల్లో కోచింగ్ ఇస్తామన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సింగరేణి స్కూల్ HMను సంప్రదించి అప్లై చేసుకోవాలన్నారు.
Similar News
News December 13, 2025
తూ.గో: కాంగ్రెస్ పార్టీకి బిల్డర్ బాబి రాజీనామా!

వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావుకు పంపినట్లు తెలిపారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<
News December 13, 2025
₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

TG: కుల, మతాలకు అతీతంగా విద్యార్థులందరికీ ఉత్తమ విద్య అందించేలా యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘CM విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు. ₹21వేల కోట్లతో ఈ స్కూళ్ల భవనాలు నిర్మిస్తున్నాం. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ₹642 కోట్లతో స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నాం’ అని వివరించారు. నైపుణ్యాల పెంపునకు ITIలలో ATCలను నెలకొల్పుతున్నట్లు వివరించారు.


