News July 22, 2024
పాలేరుకు చేరిన నాగార్జున సాగర్ జలాలు

నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా శనివారం నీరు విడుదల చేయగా ఆదివారం సాయంత్రం పాలేరు రిజర్వాయర్‌కు చేరాయి. ప్రస్తుతం 1,100 క్యూసెక్కుల నీరు చేరుతుండగా అది క్రమంగా 3వేల క్యూసెక్కులకు చేరనుంది. రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ నీటిని విడుదల చేయనుండగా.. నాలుగు రోజుల పాటు నీటి సరఫరా కొనసాగుతోంది. రిజర్వాయర్ నీటిమట్టం ఆదివారానికి 5.55 అడుగులకు పడిపోగా సాగర్ జలాల చేరికతో క్రమంగా పెరుగుతోంది.
Similar News
News November 13, 2025
తల్లి కష్టం చూసి.. గ్రూప్-1 ఉద్యోగం సాధించి..

ఖమ్మం: చిన్న తనం నుంచే తల్లి కండక్టర్‌గా పడుతున్న కష్టాన్ని చూసి, ఉన్నతస్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో గ్రూప్-1 ఉద్యోగం సాధించిన ధర్మపురి జగదీష్.. ఖమ్మం నూతన ఆర్టీఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. తొలుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన, ఆ తర్వాత పెద్ద ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో పట్టుదలతో చదివి గ్రూప్-1లో విజయం సాధించారు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన ఆయన తీరు నేటి యువతకు స్ఫూర్తిదాయకం.
News November 13, 2025
ఖమ్మం: 208 స్కూళ్లకు 26 మందే..

విద్యార్థులు క్రీడల్లో రాణించడంలో పీఈటీల పాత్ర ఎంతో కీలకం. అయితే జిల్లాలో వారి కొరత తీవ్రగా వేధిస్తోంది. జిల్లాలోని 208 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కేవలం 11 మంది పీడీలు, 15 మంది పీఈటీలు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తంగా 26 మందితోనే నెట్టుకొస్తున్నారు. శారీరక వికాసానికి క్రీడలు తప్పనిసరైనా తర్ఫీదు ఇచ్చేవారు లేకపోవడంతో ప్రతిభ ఉన్నా విద్యార్థులు స్వయంగా సిద్ధమవ్వాల్సి వస్తోంది.
News November 13, 2025
ఖమ్మం: కాస్ట్ లీ బైక్ కనిపిస్తే అంతే..

సూర్యాపేట(D) చిలుకూరు (M) కట్టకొమ్ముగూడెంకు చెందిన కృష్ణ, నల్గొండ (D) నకిరేకల్ (M) ఆర్లగడ్డగూడెంకు చెందిన శివకుమార్‌ను SRPT పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేలిముద్రలను తనిఖీ చేయగా కృష్ణపై 150 బైక్ చోరీ కేసులున్నట్లు గుర్తించారు. అతడిని విచారించగా SRPT, KMM, MLG, NLGతో పాటు HYD, APలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా అతని వద్ద KMM వాసులకు చెందిన 6 బైక్‌లు ఉన్నాయి.


